భారత రెజ్లర్లపై కుట్రకోణం..జాతీయ జట్టు కోచ్ ఆరోపణ
ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత రెజ్లర్ నిషా చేతివేలును కావాలనే విరగ్గొట్టారని జాతీయ జట్టు కోచ్ వీరేంద్ర ఆరోపించారు. భారత్ రెజ్లర్లపై కుట్ర చేస్తున్నారని, ఈ పోటీలో సోల్గమ్కు కొరియన్ టీమ్ కార్నర్ నుంచి సైగ చేయడం తాను చూశానని పేర్కొన్నారు. పోటీలో మొదట నుండి భారత రెజ్లర్ నిషా, నార్త్ కొరియా క్రీడాకారిణి సోల్గమ్ పాక్ పై ఆధిపత్యంలో కొనసాగిందని పేర్కొన్నారు. గత ఏషియన్ కప్ క్వాలిఫయిర్లో సోల్గమ్ను నిషా చాలా ఈజీగా ఓడించిందని, నిషా ఓడిపోయే ఛాన్సే లేదని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే నిషాను గాయపరిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

