విశాఖ ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థి ఎవరంటే..
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ పార్టీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఎంపిక చేసింది. టీడీపీ కూటమి పార్టీ ఇంకా అభ్యర్థి పేరును ప్రకటించలేదు. ఈ నెల 13 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 30న పోలింగ్, సెప్టెంబరు 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీల కౌన్సిలర్లు, ZPTCలు, MPTCలు ఓటుహక్కును వినియోగించుకుంటారు. ఇప్పటివరకూ మొత్తం ఓట్లు 841 ఉన్నాయి. వీటిలో వైసీపీ పార్టీకి 615 ఓట్లు ఉండగా, కూటమి పార్టీకి 215 ఓట్లు ఉన్నాయి.

