Home Page SliderNational

రాహుల్‌పై కంగనా ఘాటు విమర్శలు

ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీపై లోక్‌సభ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేశారు. కులం తెలియని వ్యక్తి కులగణన చేయాలంటున్నారంటూ క్యాప్షన్ పెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఏఐ సహాయంతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వేషధారణలో ఉన్నట్లున్న రాహుల్ ఫోటోను షేర్ చేశారు. కులాల పేరుతో దేశాన్ని చీల్చాలని చూస్తే మొదటికే మోసం వస్తుందన్నారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. కంగనా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే ఇలాంటి పనులు చేస్తోందని, రాహుల్ గాంధీని టార్గెట్ చేశారని విమర్శిస్తున్నారు.