హమాస్ చీఫ్‌ను ఇరాన్లో చంపిందెవరు?
2 ఇరాన్ ఏజెంట్లు, 3 గదుల్లో బాంబులు
హమాస్ చీఫ్ కోసం మొసాద్ డేంజరస్ ఆపరేషన్
ఇబ్రహీం రైసీ అంత్యక్రియల్లో చంపాలని తొలుత ప్రణాళిక
టెహ్రాన్ పర్యటనలో మేలో హనియెహ్‌ను హత్యకు పథకరచన
ఇజ్రాయెల్ ఎలైట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ టెహ్రాన్‌లోని సాయుధ పాలస్తీనా గ్రూప్ హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియే బస చేసిన భవనంలో పేలుడు పదార్థాలను అమర్చడానికి ఇరాన్ భద్రతా ఏజెంట్లను చేర్చుకుందని ది టెలిగ్రాఫ్ నివేదించింది. ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియల కోసం టెహ్రాన్ పర్యటన సందర్భంగా, గత మేలో హనియెహ్‌ను హత్య చేయాలనేది ప్రాథమికంగా నిర్ధారించారు. ది టెలిగ్రాఫ్‌తో మాట్లాడిన ఇద్దరు ఇరాన్ అధికారులు ప్రకారం, విపరీతమైన రద్దీ కారణంగా, దాడి ప్రణాళిక విఫలమయ్యే ప్రమాదం ఉందని ఆపరేషన్‌ను నిలిపివేశారు. అందువల్ల ఆపరేషన్ వాయిదాపడింది. ఉత్తర టెహ్రాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) గెస్ట్‌హౌస్‌లోని మూడు వేర్వేరు గదులలో మొస్సాద్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇద్దరు ఏజెంట్లు పేలుడు పదార్థాలను ఉంచారు. హనియే అక్కడే ఉండే అవకాశం ఉందని ఈ స్థానాన్ని వారు వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు.

ఇజ్రాయెల్ మొసాద్ ఎలా పనిచేస్తుంది?
$3 బిలియన్ల వార్షిక బడ్జెట్, 7,000-బలమైన సిబ్బందితో, మొసాద్ CIA తర్వాత పశ్చిమాసియాలో రెండో అతిపెద్ద గూఢచర్య సంస్థ. మొసాద్ అనేక విభాగాలను కలిగి ఉంది. కానీ దాని అంతర్గత నిర్మాణ వివరాలు బయటకు తెలియవు. ఇది పాలస్తీనా మిలిటెంట్ గ్రూపుల లోపల మాత్రమే కాకుండా, లెబనాన్, సిరియా, ఇరాన్ వంటి శత్రు దేశాలలో కూడా ఇన్ఫార్మర్లు, ఏజెంట్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విస్తారమైన గూఢచారి నెట్వర్క్ వారికి మిలిటెంట్ నాయకుల కదలికల గురించి సన్నిహిత సమాచారాన్ని అందిస్తుంది. కచ్చితమైన హత్యలు చేసేలా ప్లాన్స్ రూపొందిస్తుంది. మెట్సాడా అని కూడా పిలువబడే స్పెషల్ ఆపరేషన్స్ విభాగం, అత్యంత సున్నితమైన హత్యలు, విధ్వంసం, పారామిలిటరీ, మానసిక యుద్ధ కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

హనియేను తొలగించే ఆపరేషన్
ది టెలిగ్రాఫ్ ప్రకారం, ఇరాన్ అధికారుల వద్ద ఉన్న నిఘా ఫుటేజీ, ఏజెంట్లు దొంగతనంగా కదులుతున్నట్లు, నిమిషాల వ్యవధిలో వేర్వేరు రూముల్లోకి వెళ్లడం, బయటకు రావడం కన్పించింది. చంపేందుకు తగిన పరికరాలను రూమ్‌లో అమర్చిన తర్వాత వారు ఇరాన్ నుండి నిష్క్రమించారు. కానీ అక్కడేం జరుగుతుందో సోర్సుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు, కార్యకర్తలు హనీయా బస చేసిన గదిలో రిమోట్‌తో పేలుడు పదార్థాలను పేల్చారు. పేలుడు ఫలితంగా టెహ్రాన్‌లో అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన హనీయే మరణించాడు. ఈ హత్యను IRGCలోని అధికారులు ధృవీకరించారు. అన్సార్-అల్-మహ్దీ రక్షణ విభాగానికి చెందిన ఏజెంట్లను మొసాద్ నియమించిందని తెలుస్తోంది.

IRGC బలహీనతలను సొమ్ము చేసుకున్న ఇజ్రాయెల్
వాస్తవానికి ఈ దళం, దేశం లోపల, బయట ఉన్న ఉన్నత స్థాయి అధికారులను రక్షించే బాధ్యత నిర్వర్తిస్తుంది. దాడిలో ఇరాన్ ఏజెంట్లు పాల్గొనడాన్ని ఆ దేశం జీర్ణించుకోలేకపోతోంది. “ఇది ఇరాన్‌కు అవమానం, భారీ భద్రతా ఉల్లంఘన” అని IRGC అధికారి టెలిగ్రాఫ్‌తో అన్నారు. ఈ ఉల్లంఘనలు ఎలా జరిగాయన్న తెలుసుకునేందుకు ఇరాన్ కమిటీ ఏర్పాటు చేసింది. మొసాద్ దాడికి ప్రతీకారంగా, ఇజ్రాయెల్‌పై దాడులు చేయాలని IRGC భావిస్తోంది. హిజ్బుల్లా, ప్రభుత్వం పెంచి పెంచిన ఇరాన్ ప్రాక్సీ యూనిట్ల ద్వారా ఇజ్రాయెల్‌పై దాడి చేయాలని ఇరాన్ యోచిస్తోంది. 1979 ఇస్లామిక్ విప్లవం, ఇరాన్ రాజకీయ, సామాజిక నిర్మాణాన్ని ఉధృతం చేసినప్పటి నుండి, ప్రాక్సీ సమూహాలతో మిడిల్ ఈస్ట్ అంతటా బలగాలను ఇరాన్ సిద్ధం చేసింది. IRGC ఐదు శాఖలలో ఒకటైన కుడ్స్ ఫోర్స్, ఇంటెలిజెన్స్, రహస్య కార్యకలాపాలలో నైపుణ్యం కలిగి ఉంది. ఈ ప్రాక్సీ గ్రూపులకు ఇరాన్ ప్రాంతీయ ఎజెండాను పటిష్టం చేయడానికి ఆయుధాలు, శిక్షణను అందజేస్తూ వారికి సహాయసహకారాలు అందిస్తుంటుంది.

కొత్త అధ్యక్షుడుకి ఇన్‌ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివలేనా?
హత్య జరిగిన సమయం, అధ్యక్షుడు పెజెష్కియాన్ పదవిలో ఉన్న మొదటి రోజు కావడం, ఉద్దేశపూర్వకంగా ఘటన జరిగిందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రచార సమయంలో, అధ్యక్షుడు పెజెష్కియాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ రెచ్చగొట్టే విధానాల నుండి వైదొలగాలని, చర్చల ద్వారా ఇరాన్ స్థితిని పునరుద్ధరించాలని ప్రతిజ్ఞ చేశారు. ప్రెసిడెంట్ పెజెష్కియాన్, ఒక అనుభవజ్ఞుడైన చట్టసభ సభ్యుడు. కార్డియాక్ సర్జన్. ఇరాన్లో దేశీయ, అంతర్జాతీయ సంస్కరణలకు చాలా కాలంగా మద్దతిస్తూ వస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన విజయం మార్పు కోసమని భావిస్తున్నారు. ఐతే ఇరాన్ అంతర్గత వ్యవహారాలు, రాజకీయాల డైనమిక్స్‌ను అతివాదులే నియంత్రిస్తారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమ అధికార కేంద్రంగా ఉంటారు. పెజెష్కియన్ ప్రస్తుత పరిస్థితులను ఎలా చక్కదిద్దుతారన్నదానిపై ఆయన రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంది.

హనియెహ్ హత్య, పశ్చిమాసియాలో అగ్గి రాజేస్తుందా?
ఇరాన్ కొత్త అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లి, టెహ్రాన్‌లో జరిగిన వైమానిక దాడిలో హమాస్ బహిష్కృత రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియే మరణించారు. హమాస్ హత్యకు ఇజ్రాయెల్‌ను నిందించింది. ఇది మధ్యప్రాచ్య సంఘర్షణలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. హనియే హమాస్ అంతర్జాతీయ దౌత్యవేత్తలలో ముఖ్యుడు. గాజాలోని శరణార్థి శిబిరంలో జన్మించిన అతను 1980 చివరలో హమాస్‌లో చేరాడు. అద్భుతమైన వ్యూహాలతో అనధికాలంలోనే హమాస్‌లో కీలకంగా ఎదిగాడు. 2019 నుండి ఖతార్‌లో ప్రవాస జీవితం గడిపుతున్నాడు.

