Home Page SliderInternational

హమాస్ చీఫ్ హత్య పిరికిపంద చర్యే..హమాస్

హమాస్ చీఫ్ హనియా హత్య పిరికిపంద చర్య అని, ఇది ఇజ్రాయెల్ పనే అని హమాస్ ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామున ఈ హత్య జరిగిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ తెలిపింది. ఇజ్రాయెల్‌కు దీర్ఘకాల శత్రువు, హమాస్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హత్య చేయబడ్డాడు. తన ఇంట్లోనే అంగరక్షకునితో సహా క్షిపణి దాడిలో చనిపోయాడు. ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరయి ఇంటికి వచ్చిన తర్వాత ఈ దాడి జరిగినట్లు సమాచారం. 2006 నుండి హమాస్ సంస్థకు సుప్రీం కమాండర్‌గా కొనసాగుతున్నాడు హనియా. హమాస్ మృతి పట్ల పాలస్తీనా ప్రజలకు, ముస్లిం ప్రపంచానికి, హమాస్ యోధులకు సంతాపం తెలియజేస్తున్నట్లు హమాస్ ప్రకటన విడుదల చేసింది.