“కేటీఆర్ ఫుల్లీ ఆర్టిఫీషియల్.. ఇంటెలిజెంట్లీ నిల్”:సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ప్రశ్నలపై అసెంబ్లీలో ధీటైన సమాధానాలు ఇచ్చారు. సీఎం మాట్లాడుతూ.. కేటీఆర్ ఫుల్లీ ఆర్టిఫీషియల్,ఇంటెలిజెంట్లీ నిల్ అన్నారు. తెలంగాణాను పదేళ్ల పాటు పాలించిన మీరు ఏమి చేయకుండా 10 నెలల్లోనే మా పనిని ప్రశ్నిస్తున్నారన్నారు. గత పదేళ్లల్లో బీఆర్ఎస్ తెచ్చిన ఒక్క పాలసీ అయినా ఉందా అని సీఎం ప్రశ్నించారు. మేము ప్రతి అంశంలో ఒక పాలసీని తీసుకు వచ్చామన్నారు. వాళ్ల ప్రభుత్వంలో ఫార్మాసీటీలని వాళ్లంటే..ఫార్మా విలేజ్లని మేము అంటున్నామన్నారు. కాగా రాష్ట్రంలో AI హబ్ తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు.అయితే ముచ్చర్లలో నిర్మించే నాల్గో సిటీనే ఫ్యూచర్ సిటీ అని సీఎం పేర్కొన్నారు.

