Home Page SliderTelangana

నేడు తెలంగాణాకు రానున్న కొత్త గవర్నర్

తెలంగాణా నూతన గవర్నర్‌గా జిష్ణు దేవ్ నియమింపబడిన విషయం తెలిసిందే. కాగా ఆయన ఇవాళ మధ్యహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు  చేరుకోనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌కు స్వాగతం పలకనున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం 5గంటలకు ఆయన రాజ్‌భవన్‌లో తెలంగాణా కొత్త గవర్నర్‌గా ప్రమాణం చేయనున్నారు. కాగా గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,తెలంగాణా మంత్రులు,బీఆర్ఎస్,బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు సమాచారం.