జీరో కట్స్‌తో విక్రమ్ “తంగలాన్”..
తమిళ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా దర్శకుడు పా రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “తంగలాన్” గురించి అందరికీ తెలిసిందే. టీజర్‌తోనే ఒక్కసారిగా భారీ హైప్ లేపిన ఈ చిత్రం రీసెంట్‌గా ట్రైలర్‌తో కూడా మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఇప్పుడు సెన్సార్ డిటెయిల్స్ బయటకి వచ్చాయి.
ఈ చిత్రానికి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్‌ని ఎలాంటి కట్స్ లేకుండా అందించినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. అలాగే సినిమా అధికారిక రన్ టైంగా దాదాపు 157 నిమిషాలకు కుదించారు. సినిమా దాదాపు రెండు గంటల 37 నిమిషాల పాటు థియేటర్స్‌లో కొనసాగనుంది. విక్రమ్ పెర్ఫామెన్స్ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పా రంజిత్ ఏ లెవెల్లో ప్లాన్ చేసాడో చూడాలి. ఇక ఈ చిత్రంలో మాళవిక మోహనన్ ఫీమేల్ లీడ్‌లో నటించగా జివి ప్రకాష్ సంగీతం అందించాడు, ఈ ఆగస్ట్ 15న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.