Home Page SliderNational

“మిస్టర్ బచ్చన్” టీజర్ రెడీ

మన టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “మిస్టర్ బచ్చన్”. మరి సాలిడ్ బజ్ ఉన్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తన మార్క్‌లో తెరకెక్కించగా ఇప్పుడు సినిమా రిలీజ్‌కి సిద్ధం ఔతోంది.

మరి ఈ గ్యాప్‌లోనే టీజర్ ట్రీట్‌పై కూడా మేకర్స్ అధికారిక క్లారిటీ అందించగా ఇప్పుడు ఈ టీజర్‌పై సాలిడ్ అప్డేట్ ఇచ్చేశారు. ఈ టీజర్‌ని మేకర్స్ ఈ జూలై 28న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేస్తూ రవితేజ, భాగ్యశ్రీ పై ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ని రివీల్ చేసి తెలిపారు. మరి ఇందులో ఇద్దరి డ్రెస్సింగ్ వింటేజ్ స్టైల్‌లో కనిపిస్తుండగా ఇదేదో సాంగ్‌కి సంబంధిచింది అన్నట్టుగా కనిపిస్తోంది.

ఆల్‌రెడీ బచ్చన్ షో రీల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే కేజీయఫ్ ఎడిటర్‌తో హరీష్ శంకర్ ఈ సినిమా టీజర్‌ని కట్ చేయించడం దాని విషయంలో హ్యాపీగా ఉన్నానని చెప్పడం కూడా జరిగింది. మరి రేపు రానున్న ఏఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీవారు నిర్మాణం వహించగా ఈ ఆగస్ట్ 15న సినిమా రిలీజ్‌కి రాబోతోంది.