ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి నారా లోకేష్
ఏపీలో ఉద్యోగాల కల్పనపై ఐటీ,విద్యా శాఖమంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లోకేష్ శాసనమండలిలో తెలిపారు. కాగా ఉపాధ్యాయుల నియామక అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుందన్నారు. ఈ మేరకు డీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రక్రియు పకడ్భందీగా పూర్తి చేస్తామన్నారు. కాగా ఏపీలో ప్రభుత్వ,ప్రైవేట్ విభాగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. దీని కోసం ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు మరిన్ని ఇన్సెంటివ్లు ఇచ్చి ప్రోత్సహిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.