మరికాసేపట్లో వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
ఏపీ మాజీ సీఎం జగన్ ఇవాళ తాడేపల్లిలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అయితే మరికాసేపట్లోనే అనగా ఉదయం 11.30 గంటలకు ఈ మీడియా సమావేశం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పలు శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే వీటికి జగన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కౌంటర్ ఇవ్వనున్నట్లు సమాచారం.కాగా జగన్ ఏపీలో జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తు గత రెండు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేశారు.ఈ ధర్నాలో INDIA కూటమిలోని పలు పార్టీలు జగన్‌కు మద్దతు తెలిపాయి.

