కరీంనగర్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పర్యటన
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇవాళ కరీంనగర్లో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా వారంతా లోయర్ మానేరు డ్యామ్‌ను పరిశీలించారు.కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్‌ల పరిశీలన జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ తెంలగాణా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ను బద్నాం చేయాలని ప్రయత్నిస్తుందని కేటీఆర్ ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ 10 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకొని బలంగా నిలబడిందని తెలిపారు.అయితే వందల టీఎంసీల వరద వృథాగా పోతుందన్నారు.కాళేశ్వరంలో పంపింగ్‌ను ప్రారంభించాలన్నారు.తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టాలన్నారు. రాజకీయ కక్షలతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని కేటీఆర్ వెల్లడించారు.


 
							 
							