Home Page SliderTelangana

కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా తెలంగాణా అసెంబ్లీలో చర్చకు బీజేపీ అభ్యంతరం

తెలంగాణాలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. కాగా ప్రస్తుతం అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా చర్చ జరుగుతోంది.దీంతో అసెంబ్లీలోని బీజేపీ సభ్యులు చర్చను వ్యతిరేకించారు. కాగా ఈ చర్చ ద్వారా తెలంగాణాకు చెడ్డపేరు వస్తుందని బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఏపీ,బీహార్‌కు మాత్రమే నిధులు కేటాయించి మిగతా రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపిండంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే.