Andhra PradeshHome Page Slider

ఢిల్లీలో జగన్ ధర్నా, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతు

ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధర్నాకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోదంటూ వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో 35 రాజకీయ హత్యలు జరిగాయని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఈ సందర్భంగా జగన్ చెప్పారు. వైసీపీ కార్యకర్తలపై వెయ్యికిపైగా అక్రమ కేసులు పెట్టారన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరగనివ్వలేదన్నారు. లోకేష్ రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్‌లు పెడుతున్నారని, నచ్చనివారిపై కక్షసాధిస్తున్నారని మండిపడ్డాహు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని, జాతీయ మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

ఇక వైసీపీ ధర్నాకు అఖిలేష్ యాదవ్ మద్దతుగా నిలిచారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఎవరైనా అధికారంలోకి వస్తుంటారు. పోతుంటారని, ప్రత్యర్థుల ప్రాణాలు తీయడం కరెక్ట్ కాదని అఖిలేష్ చెప్పారు. కార్యకర్తలే పార్టీకి బలం, బలగమని వారి కోసం జగన్ ధర్నా చేస్తున్నారని, జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని చెప్పారు. ఏపీ తరహాలోనే యూపీలో కూడా బుల్డోజర్ రాజకీయాలు నడుస్తున్నాయని అఖిలేష్ చెప్పారు.