ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా ఇవాళ కూడా ఏపీలో అసంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు ప్రారంభమైన సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.దీంతో యాక్ట్ రద్దు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరిస్తూ సభలో బిల్లు ప్రవేశ పెట్టారు.

