ఏపీలో ఉచిత బస్ ప్రయాణం అమలుకు డేట్ ఫిక్స్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటన చేశారు. కాగా ఏపీలో ఆగస్టు 15నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానుందన్నారు. ఈ మేరకు ఆయన దీని గురించి ట్విటర్లో పోస్ట్ చేశారు.
