SBI లో లోన్లు తీసుకునేవారికి షాక్
భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన బ్యాంక్ SBI. అయితే SBIలో లోన్ తీసుకున్న,తీసుకోబోయే వారికి ఆ బ్యాంక్ షాక్ ఇచ్చింది. కాగా SBI మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగి రేట్(MCLR)ను 10 బేస్ పాయింట్లు పెంచినట్లు SBI ప్రకటించింది. అయితే పెంచిన రేట్లు ఇవాళ నుంచే అమల్లోకి రానున్నాయి.దీంతో వెహికల్ ,హోమ్ లోన్స్ తీసుకున్న వారిపై భారం పడనున్నట్లు తెలుస్తోంది. కాగా ఒకరోజు MCLRకు 8.1%,నెలకు 8.35%,3 నెలలకు 8.4%,6 నెలలకు 8.75%,ఏడాదికి 8.85%,రెండేళ్లకు 8.95%,మూడేళ్లకు 9% వడ్డి చెల్లించాల్సి ఉంటుంది.