Home Page SliderTelangana

డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త పరీక్ష

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను ఆధునీకరించాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు ఆర్టీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపై టెస్ట్ డ్రైవింగ్‌కు వచ్చేవారు వేరేదారిలో లైసెన్స్ పొందే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. డ్రైవింగ్‌లో శిక్షణ పొంది, నైపుణ్యంతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికే లైసెన్స్ జారీ చేస్తామని అధికారులు తెలిపారు.