బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌పై.. సీఎం రేవంత్‌కు హరీష్ బహిరంగ లేఖ
హైదరాబాద్: బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అగమ్యగోచరంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. విద్య, ఉపాధి వంటి పథకాలు ఆగిపోవడం విచారకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని విస్మరించిందని పేర్కొన్నారు. పేద బ్రాహ్మణులకు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.

