రఘురామ కేసులో మాజీ సీఎం జగన్ పేరు
టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పేరు ఎఫ్ఐఆర్లో నమోదయిన సంగతి తెలిసిందే. ఐతే దీనిలో మాజీ సీఎం జగన్ పేరును కూడా చేర్చారు ఎమ్మెల్యే. అప్పటి సీఎం జగన్ ఒత్తిడి వల్లే తనపై పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2021లో మే14న తనను సునీల్ కుమార్ అరెస్టు చేసి, హత్యాయత్నం చేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిలో ఏ1గా సునీల్ కుమార్, ఏ2గా ఐపీఎస్ సీతారామాంజనేయులు, ఏ3గా జగన్ పేరును చేర్చారు. గతంలో ఎంపీగా ఉన్న తనను వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు సీఐడీ కక్షపూరితంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. వీరితో పాటు సీఐడీ మాజీ ఐజీ సునీల్ నాయక్, మాజీ డీఎస్పీ పాల్పైన కూడా కేసులు నమోదు చేశారు.