విరాట్ కోహ్లీ పబ్ మేనేజర్‌పై కేసు నమోదు
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బెంగుళూరులో వన్8 కమ్యూన్ పబ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ పబ్ మేనేజర్‌పై FIR నమోదైనట్లు తెలుస్తోంది. కాగా బెంగుళూరులోని పబ్‌లన్నీ అర్థరాత్రి 1 గంటలలోపు మూసివేయాలని ప్రభుత్వం షరతులు విధించింది. అయితే విరాట్ కోహ్లీ వన్8 కమ్యూన్ పబ్ 1:20 గంటల వరకు తెరిచి ఉంచారు. దీంతో నగరంలోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇదే కారణంతో బెంగుళూరులోని మరో 3 పబ్బులపై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

