భోలే బాబా రూ.100 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన అధికారులు
హథ్రస్లో జరిగిన తొక్కసలాట ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోటానికి కారణమైన భోలే బాబాకు సంబంధించిన రూ.100 కోట్ల ఆస్తులను అధికారులు తాజాగా సీజ్ చేశారు. ఇటీవల యూపీలోని హథ్రస్లో జరిగిన సత్సంగ్ కార్యక్రమంలో 121 మంది చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆ కార్యక్రమం నిర్వహించిన భోలే బాబా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. కాగా ఈ ఘటన జరిగిన అనంతరం భోలే బాబా ఘటనాస్థలం నుంచి పరారైయ్యారు.అయితే పోలీసులు మాత్రం ఇప్పటివరకు భోలే బాబాపై కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో హథ్రస్ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు భోలే బాబా గురించి విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. ఈ దర్యాప్తులో పోలీసులు బాబాకు రూ.100 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఆయనకు 24 ఆశ్రమాలు ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా బాబాకు ప్రత్యేత సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే భక్తుల నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయనని చెప్పే భోలే బాబా ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

