కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి: నిరంజన్ రెడ్డి
టిజి: బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ నేతలకు ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాసినట్లు మీడియాలో మాట్లాడారు. దీనిపై ఆయన స్పందించాలని కోరారు. ఆరు గ్యారంటీల ఊసెత్తకుండా ఇలాగే పాలన కొనసాగితే ప్రజలు ఉపేక్షించరని దుయ్యబట్టారు.

