Andhra PradeshHome Page Slider

వారాహి దీక్ష విరమించిన ఏపీ డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు పవన్ వారాహి దీక్షను విరమించారు. ఈ సందర్భంగా పవన్ మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారాహి దీక్ష చేపట్టారు.