రాజ్యసభకు రాజీనామా చేసి, కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నేత
బీఆర్ఎస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. పార్టీకి ఝలక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరేవారి సంఖ్య ఎక్కువవుతోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుండి రాజ్యసభకు ఎన్నికైన కె. కేశవరావు(కేకే) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు అందజేశారు. బుధవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారడం వల్ల రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన పదవీకాలం మరో రెండేళ్లు ఉండడం విశేషం.