Home Page SliderTelangana

శుక్రవారం హైదరాబాద్‌కి రానున్న చంద్రబాబు

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక శుక్రవారం తొలిసారి హైదరాబాద్‌కు చంద్రబాబు నాయుడు రానున్నారు. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్దఎత్తున స్వాగతం చెప్పేందుకు టిటిడిపి శ్రేణులు రెడీ అవుతున్నారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు బేగంపేట్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని పొలిటి బ్యూరో సభ్యుడు అర్వింద్ కుమార్ గౌడ్ తెలిపారు.