ఉప్పాడ సముద్ర తీరానికి ఏపీ డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాకినాడలోని పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే గత రెండు రోజుల నుంచి పిఠాపురంలో పర్యటిస్తోన్న పవన్ వరుస సమీక్షలు,భేటీలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఉప్పాడ సముద్ర తీరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా అక్కడ పవన్ సముద్ర తీరంలో కోతకు గురౌతున్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. తుఫాన్ ప్రభావంపై ఫోటో గ్యాలరీని కూడా పవన్ పరిశీలించారు.ఈ క్రమంలో తుఫాన్‌కు సంబంధించిన సర్వే వివరాలను అధికారులు పవన్‌కు వివరిస్తున్నారు.