డయాగ్నోస్టిక్ హబ్‌తో 1.1 కోట్ల మందికి లబ్ధి
టిజి: టి డయాగ్నోస్టిక్స్‌ను 2018లో ప్రారంభించారు. నాణ్యమైన డయాగ్నోస్టిక్ సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. రక్త, మూత్ర, ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్, ఈసీజీ లాంటి పరీక్షలన్నీ ఉచితంగా చేస్తున్నారు. 24 గంటల వ్యవధిలోనే 92 శాతం రిపోర్టులను ఆన్‌లైన్ ద్వారా రోగుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ రూపంలో పంపుతున్నారు. మొత్తం 1.1 కోట్ల మంది లబ్ధిపొందారు.

