Home Page SliderNational

టెలిగ్రామ్‌లో సిమ్ కార్డుల లభ్యం..నయా దందా

సిమ్ కార్డుల లభ్యతపై ఇటీవల పరిమితులు విధించింది కేంద్రప్రభుత్వం. ఒక మనిషికి 8 కంటే ఫోన్ సిమ్ కార్డులు ఉండకూడదని నియమం పెట్టింది. అయితే సైబర్ నేరగాళ్లు కొత్త పద్దతిలో సిమ్ కార్డుల దందాకు తెరలేపారు. సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు ఏది కావాలన్నా టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా ఇప్పిస్తున్నారు. వేల కోట్ల సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల నమోదైన సైబర్ నేరాలలో 80 శాతం మోసాలు టెలిగ్రామ్ ద్వారా జరిగాయని గుర్తించారు. దీనితో వినియోగదారులను సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు కావాలంటే ఇలా టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా తీసుకోవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.