Home Page SliderNational

సవరణ అనంతరం మరోసారి నీట్ ఫలితాలు విడుదల

నీట్ 2024 ఫలితాలు సంచలనాలకు దారితీసాయి. అనేక మందికి మొదటి ర్యాంకు రావడం, నూటికి నూరుశాతం మార్కులు రావడం, పేపర్ లీకేజి వంటి సమస్యలతో నీట్ యూజీ 2024 గందరగోళం అయ్యింది. ఎన్‌టీఏ మరోసారి పరీక్ష నిర్వహించి చివరికి 1563 మంది అభ్యర్థుల ర్యాంకులను సవరించి విడుదల చేసింది. నీట్ ఫలితాలు ప్రకటించింది. దీనిప్రకారం నీట్ యూజీ 2024 అభ్యర్థులందరి ర్యాంకులు మరోసారి సవరించారు. రెండవసారి 1563 మందికి పరీక్ష నిర్వహించగా వారిలో 813 మంది మాత్రమే హాజరయ్యారు. సమాధానాల ఫైనల్ కీని వెబ్‌సైట్‌లో ఉంచారు. చివరికి ఫైనల్ స్కోర్ కార్డులు అప్‌లోడ్ చేశారు.