ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఇక లేనట్లేనా..?
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీల వ్యాఖ్యలు చేశారు. కాగా ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగొచ్చు..కొనసాగకపోవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఏపీలో గతంలో ఇచ్చే విధానానికి భిన్నంగా జూలై 1 నుంచి పెన్షన్లు అందించనున్నామన్నారు. కాగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తించబడిన సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికి పెన్షన్లు అందిస్తామన్నారు. అయితే ఏపీలోని వాలంటీర్లను ఫించన్ల పంపిణీకి తాము ఉపయోగించాలని అనుకోవడం లేదన్నారు. ఏపీలో ఇప్పటికే రాజీనామా చేసిన వాలంటీర్లపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

