Home Page SliderTelangana

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. 2011లో రైల్ రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని వివరించారు. రైల్ రోకో కేసులో తనను 15వ నిందితుడిగా చేర్చారని తెలిపారు. తాను రైల్ రోకోలో పాల్గొనలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై నేడు (మంగళవారం) విచారణ జరగనుంది.