Andhra PradeshHome Page Slider

ఏపీలో ఈసారి పెన్షన్లు పంపిణీ చేసేది వీళ్లే..?

ఏపీ సర్కార్ పెన్షన్ల పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కాగా మొన్నటివరకు ఏపీలో గ్రామ వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏపీలో లక్షమందికి పైగా వాలంటీర్లు ఎన్నికల సమయంలో రాజీనామా చేశారు. దీంతో ఈసారి సచివాలయ సిబ్బందితో ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ మేరకు ఏపీలో జూలై 1న సచివాలయ సిబ్బంది పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.