Home Page SliderTelangana

బీఆర్ఎస్‌ను కాదని పోచారం కాంగ్రెస్ తీర్థం: ప్రశాంత్‌రెడ్డి

తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. పార్టీలో పోచారంకు అధిక ప్రాధాన్యతను కేసీఆర్ ఇచ్చారన్నారు. ప్రాణం పోయేవరకు కేసీఆర్ వెంటే ఉంటానని చెప్పి పార్టీ మారడం బాధాకరమన్నారు. అధికారం, పదవులు లేకుంటే బతకలేమా.. ఈ ఏజ్‌లో పార్టీ మారడం న్యాయమా? అని ప్రశ్నించారు.