టీ20 ఆశలు వదులుకున్న యూఎస్‌ఏ
టీ 20 ఆతిథ్య దేశం యూఎస్‌ఏ సూపర్ 8 దశకు వచ్చి వరుసగా రెండవ మ్యాచ్‌లో కూడా ఓటమి పాలయ్యింది. దీనితో టీ 20లో ఇక ఆశలు లేనట్లే. బార్బడోస్‌లో వెస్టిండీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ పోటీ ఏకపక్షంగా సాగింది. వెస్టిండీస్ దూకుడుకి యూఎస్‌ఏ ఏమాత్రం నిలవలేక పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ 128 పరుగులకు ఆలౌట్ అయ్యింది. విండీస్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 10.5 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని పూర్తి చేసింది. మొదటి సూపర్ 8 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో ఓడిపోయిన వెస్టిండీస్ యూఎస్‌ఏ మ్యాచ్‌లో నెట్ రన్‌రేట్ పెంచుకోవాలనే ఉద్దేశంతో దూకుడుగా ఆడింది. 129 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన విండీస్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చాలా సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బ్యాటర్ షైహోప్ 39 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లు కొట్టి 82 రన్స్‌తో విధ్వంసం సృష్టించాడు.

