రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు సంచలన తీర్పు
రాజకీయ లబ్ది కోసం అడ్డగోలుగా పెంచేసిన 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ పట్నా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత సంవత్సరం బిహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65 శాతానికి పెంచింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేకమంది పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని భావించి, వాటిని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

