మరోసారి కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురయ్యింది. ఆయన జ్యూడిషియల్ కస్టడీని మరో మారు పెంచుతూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. జూలై 3 వరకూ కేజ్రీవాల్ కస్టడీని పెంచింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో అక్రమాల విషయంలో విచారణను ఇంకా లోతుగా చేయవలసి ఉందని దీనికోసం కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని ఈడీ న్యాయవాదులు కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనతో పాటు వినోద్ చౌహన్ కస్టడీని కూడా పొడిగించింది.

