Home Page SliderNational

మెగాస్టార్ మాజీ అల్లుడు మృతి

మెగాస్టార్ చిరంజీవీ చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే గత కొంత కాలంగా లంగ్స్ డ్యామేజ్‌తో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. కాగా చిరంజీవీ చిన్న కూతురు శ్రీజ 2007లో భరద్వాజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.అయితే వీరిద్దరు 2014లో చట్టబద్దంగా విడాకులు తీసుకొని విడిపోయారు. తర్వాత 2016లో శ్రీజ మరో పెళ్లి చేసుకోగా..శిరీష్ కూడా 2019లో మరో పెళ్లి చేసుకున్నారు.