జామపండును తినే సమయాలు!
జామకాయలో ఫైటోన్యూట్రియెంట్లు పుష్కళంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. పొట్ట సంబంధిత సమస్యలను దూరం చేయడంలో జామ మంచి పాత్ర వహిస్తోంది. అయితే జామపండు ఏ టైములో తినాలి అనే సందేహం చాలామందికి కలిగి ఉంటుంది. అయితే సాయంత్రం పూట లేదా రాత్రి పూట జామపండు తినకూడదని అంటారు. రాత్రిపూట జామపండు తినడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. జామ పండును పగలు, మధ్యాహ్నం మాత్రమే తినాలి. అప్పుడే సరిగ్గా అరుగుతుంది.

