మరో 5 రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు యెల్లో అలెర్ట్
తెలంగాణలో ఈ నెల 19వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఓ మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుండి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని యెల్లో అలెర్ట్ జారీచేసిన ప్రభుత్వం.