Home Page SliderNational

కేజ్రీవాల్ సతీమణికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

  కేజ్రీవాల్ సతీమణికి ఢిల్లీ హైకోర్టు నుండి హెచ్చరిక  నోటీసులు అందాయి. ఆమె  సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో విషయంలో దానిని తొలగించాలంటూ హైకోర్టు నోటీసు జారీ చేసింది. కేజ్రీవాల్ తన కేసు విచారణ సందర్బంలో మార్చి 28న హైకోర్టులో మాట్లాడుతున్న దృశ్యాలను ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్టు చేసింది. దీనితో మండిపడిన హైకోర్టు ఆ వీడియోను ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఖాతాల నుండి తీసివేయాలని ఆమెకు, ఆయా సోషల్ మీడియా వేదికలకు ఆదేశాలు జారీచేసింది.