Andhra PradeshHome Page Slider

ఏపీలో పెరిగిన పెన్షన్లు

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. కాగా నిన్న ఏపీ సచివాలయంలో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎంగా పలు ఫైళ్లపై సంతకం చేశారు. దీనిలో పెన్షన్ల పెంపు కూడా ఉంది. ఈ మేరకు ఇవాళ సీఎస్ నీరభ్ కుమార్ పెన్షన్ల పెంపుపై ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సామాజిక పెన్షన్ల పేరును ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధరిస్తూ జీవో విడుదల చేశారు. దీంతో ఇక నుంచి రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, మత్స్యకారులు , తదితరులు నెలకు రూ.4000/- పెన్షన్ అందుకోనున్నారు. మరోవైపు దివ్యాంగులకు రూ.6000/- పెన్షన్ అందనుంది. కాగా పెరిగిన పెన్షన్లను ఏప్రిల్ నుంచే ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో జూలై 1న లబ్దిదారులంతా రూ.7000/- పెన్షన్ తీసుకోనున్నారు. దీంతో ఏపీలోని పెన్షన్ లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.