జంపింగ్ నేతలకు ఇద్దరికి మంత్రి పదవులు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు టీడీపీ పార్టీకి జంప్ అయిన ఇద్దరు మాజీ వైసీపీ నేతలను మంత్రి పదవులు వరించాయి. నూజివీడు నుండి కొలుసు పార్థసారథి, ఆత్మకూరు నుండి ఆనం రామనారాయణరెడ్డికి చంద్రబాబు మంత్రి వర్గంలో చోటు లభించింది. ఇలా వైసీపీ నుండి టీడీపీకి వలస వచ్చిన వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(నెల్లూరు రూరల్), వసంత వెంకటకృష్ణప్రసాద్(మైలవరం), గుమ్మునూరి జయరాం(గుంతకల్లు),కోనేటి ఆదిమూలం(సత్యవేడు)లకు మాత్రం అవకాశం దక్కలేదు.