డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్, 24 మంత్రుల జాబితా
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాసేపట్లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ కు అవకాశం కల్పించగా, నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడికి అవకాశం కల్పించారు. ఇక మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పొంగూరు నారాయణకు అవకాశం ఇ్చచారు. నాదెండ్ల మనోహర్, అనిత వంగలపూడి, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండీ ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారధి, డోలా వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్. సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి అవకాశం కల్పించారు. జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరికి అవకాశం కల్పించారు. కేబినెట్‌లో 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించగా వారిలో ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. బీసీలు 8, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లింలకు ఒకరికి, వైశ్యులకు ఒకరికి అవకాశం కల్పించారు.

