Home Page SliderTelangana

సింగరేణి కార్మిక కుటుంబాలకు శుభవార్త

సింగరేణి కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సింగరేణి కార్మికుల కారుణ్య నియామకాల వయోపరిమితిని పెంచుతున్నట్లు సింగరేణి యాజమాన్యం  ప్రకటించింది. కాగా సింగరేణి కార్మికుల వారసుల వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతున్నట్లు తెలిపింది. అయితే తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీల్లో భాగంగానే వయోపరిమితిని పెంచుతున్నట్లు సింగరేణి యాజమాన్యం  వెల్లడించింది. ఈ మేరకు సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.