రామోజీరావు భౌతికకాయానికి చంద్రబాబు నివాళులు
టీడీపీ అధినేత చంద్రబాబు రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్నారు. కాగా రామోజీరావు భౌతికకాయానికి చంద్రబాబు దంపతులు నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు దంపతులు రామోజీరావు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు.కాగా నిన్న ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన రామోజీరావు పార్థివ దేహన్ని చివరిసారిగా చూసేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు.కాగా రామోజీరావు అంత్యక్రియలు రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ అధికారా లాంఛనాలతో జరనున్నాయి. రామోజీరావు మనవడు విదేశాల నుండి వచ్చిన తర్వాత ఆయన అంతిమ యాత్ర ప్రారంభం కానున్నట్లు సమాచారం.

