ఏపీ, తెలంగాణ ఆరా సర్వే ఫలితాలు
ఏపీ, తెలంగాణ పోస్ట్ పోల్ సర్వే ఫలితాలను సంస్థ డైరెక్టర్ షేక్ మస్తాన్ (ఆరా మస్తాన్) విడుదల చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 94-104 స్థానాలు, టీడీపీకి 71-81 స్థానాలు వస్తాయని ఆరా సంస్థ అంచనా వేసిది. ఇక వైసీపీకి 49.41 శాతం ఓట్లు రాగా, టీడీపీ శాతం ఓట్లు 47.55 శాతం ఓట్లు రాగా, ఇతరులకు 3.04 శాతం ఓట్లు వస్తాయని తేల్చారు. ఇక మహిళ, పురుష ఓటర్ల పరిశీలిస్తే… వైసీపీకి పురుష ఓటర్లు 45.35 శాతం రాగా, మహిళ ఓటర్లు 51.56 శాతం, ఇతరులకు 3.09 శాతం… మహిళా ఓటర్ల వారీగా పరిశీలిస్తే, 54.76 శాతం వైసీపీకి, 42.01 శాతం మహిళలకు, ఇతరులకు 3.23 శాతం వస్తాయని తెలిపారు. ఇక ఎంపీల విషయానికి వస్తే రెండు పార్టీల మధ్య తేడా ఒక శాతం లోపే ఉందని ఆరా అంచనా వేసింది. వైసీపీకి 13-15 ఎంపీలు వస్తాయని అంచనా వేయగా, టీడీపీకి 10-12 ఎంపీలు వస్తాయని తెలింది. ఇక ఓటు షేర్ విషయానికి వస్తే 48.29 శాతం, టీడీపీ శాతం 47.68 శాతం, ఇతరులకు 4.03 శాతం వస్తాయన్నారు. ఇక తెలంగాణ ఎంపీల విషయానికి వస్తే ఆరా ఆసక్తిర ఫలితాలను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీకి 7-8 స్థానాలు వస్తాయని, బీజేపీకి 8-9 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు రాదని తేల్చారు. ఇక మజ్లిస్ పార్టీకి ఒక స్థానం రానుంది. ఇక ఓట్ల శాతం పరిశీలిస్తే 38.43 శాతం కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ 36.65 శాతం, బీఆర్ఎస్ పార్టీకి 18.99 శాతం ఓట్లు రావొచ్చని, ఇతరులకు 5.93 శాతం ఓట్లు రావచ్చని పేర్కొన్నారు.