ఎలక్షన్ నిర్వహణలో పోలీసులు విఫలం: టీడీపీ అధినేత చంద్రబాబు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయ్. 11 గంటల వరకు పోలింగ్ 25 శాతం వరకు జరిగినట్టు ప్రాధమిక అంచనాలు తెలుస్తున్నాయ్. అయితే పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. ఆయా ప్రాంతాల్లో ఉదయం నుంచి తాము ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ స్పందించడం లేదని ఆరోపించారు. పోలీసులు శాంతిభద్రతలు కాపాడటంలో విఫలమయ్యారన్నారు. ఈసీ తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. పరిస్థితులను చక్కదిద్దాలన్నారు.

