మనసులు గెలుచుకుంటున్న నరసాపురం ఎంపీ అభ్యర్థులు (Exclusive)
ఎప్పటి వరకు ఆమె ఎవరూ కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఆమెను ఏకంగా సీఎం జగన్ నరసాపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. లాయర్ గా సుపరిచితులరాలైన ఆమె అంతకు ముందు కేవలం కార్పొరేటర్ గా మాత్రమే పనిచేశారు. అయితే మారిన రాజకీయ పరిస్థితులతో ఆమెకు సీఎం జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. వాస్తవానికి నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు బీజేపీ, టీడీపీ లేదంటే జనసేన ఎంపీ టికెట్ లభిస్తుందని అంతా భావించారు. అయితే ఆయనకు బీజేపీ అవకాశం ఇవ్వలేదు. అక్కడ్నుంచి పార్టీకి మొదట్నుంటి లాయల్ గా వ్యవహరించే శ్రీనివాసవర్మకు ఛాన్స్ ఇచ్చింది. బీజేపీ పోటీ చేస్తున్న 6 ఎంపీలలో ఒకే ఒక ఒరిజినల్ బీజేపీ నేత ఆయనంటూ పార్టీలో ప్రచారం జరిగింది.

అయితే ప్రస్తుతం నరసాపురం నియోజకవర్గంలో హోరాహోరీ సాగుతోంది. ఇక్కడ్నుంచి మహిళను నిలిపి, రఘురామరాజును ఓడించాలని జగన్ భావించినా, మరో అభ్యర్థి శ్రీనివాసవర్మకు ఛాన్స్ లభించింది. దీంతో ఇద్దరు నేతలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నారు. ప్రత్యర్థులుగా పోటీపడుతున్న ఇద్దరు నేతలు ఉమాబాల, శ్రీనివాసవర్మ పాలకొల్లులో ఒకరితో ఒకరు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఆత్మీయంగా పలకరించుకున్నారు. వారిద్దరూ రెండు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ స్నేహితులు కావడం కూడా విశేషం. అందుకే రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లోలా కాకుండా ఇక్కడ మాత్రం సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తోంది.

అదే సమయంలో అక్కడకు వచ్చిన పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల రామానాయుడు, ఉమాబాలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం సాగుతుండగా, నరసాపురంలో జరిగిన ఘట్టం నిజంగా నభూతో నభవిష్యత్ అని చెప్పాల్సి ఉంటుంది. నరసాపురంలో రఘురామకృష్ణరాజు పోటీ చేస్తే, అక్కడ హైఓల్టేజ్ యుద్ధం జరుగుతుందని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో అంతా స్తబ్దుగా ఉంది. అటు బీజేపీ, ఇటు వైసీపీ నాయకులు ఎవరి ప్రచారం వారు చేసుకుంటుండగా తాజా ఉదంతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

నరసాపురం పార్లమెంట్ సీటులో జనసేన, బీజేపీ, టీడీపీ మూడు పార్టీలు పోటీ చేస్తోండటం కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది. ఎవరికి వారే తమ అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపాల్సిందిగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆచంట నుంచి పితాని సత్యనారాయణ, పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు, నరసాపురం నుంచి జనసేన నేత బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత పులపర్తి ఆంజనేయులు, ఉండి నుంచి రఘురామకృష్ణరాజు, తణుకు నుంచి అరిమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగుడెం నుంచి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ హోరాహీరీ తలపడుతుండగా.. ఇక్కడ ఎంపీ ఎన్నికకు క్రాస్ ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నారు.

