Andhra PradeshHome Page Slider

రాజమండ్రి సభకు చంద్రబాబు దూరం, ఎందుకంటే!?

ఏపీలో ఇవాళ జరగనున్న ప్రధాని మోదీ సభకు, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకావడం లేదు. చంద్రబాబు హెలికాప్టర్ కు సిగ్నల్ సమస్య వచ్చింది. ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న సమయంలో మరో హెలికాప్టర్ వెళ్లేందుకు అనుమతి లేదని తెలుస్తోంది. అందుకే ఆయన ఈ సభకు హాజరుకాబోవడం లేదని సమాచారం. అయితే చంద్రబాబు సాయంత్రం, అనకాపల్లిలో జరిగే సభకు హాజరవుతారు. అయితే రాజమండ్రి సభకు పవన్ తోపాటుగా, నారా లోకేష్ హాజరవుతారు. ఏపీ ఎన్నికల్లో ఈసారి విజయం సాధించి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేనతో కూటమిగట్టింది. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తోంది. తాజాగా ఈ ప్రచారానికి బీజేపీ అతిరథమహారథులు హాజరవుతున్నారు.